Telugu song Lyrics ' ఆలయంలో ప్రవేశించండి' free online watch

ఆలయంలో ప్రవేశించండి

పల్లవి: ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం

1. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమనందం హల్లెలూయా ..ఆలయంలో..

2. ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరేదం పొందెదం
ఆనదంమానదం హల్లెలూయా ..ఆలయంలో..